హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.) బీజేపీలో చేరుతున్న వారికి
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సూచనలు జారీ చేశారు. బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం-సుస్వాగతం.. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేముందు కొంతమందితో చర్చలు చేసుకొని రండి అని రాజా సింగ్ సూచనలు చేశారు. ఇటీవల రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో, మీ జిల్లాలో, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు. మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరు. ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తదని గ్యారెంటీ కూడా ఉండదు. బీజేపీలో ఈ రోజు మీరు చేరుంటారు కదా. మొదట్లో ఫస్ట్ సీట్లో మీరు ఉంటారు కానీ తర్వాత లాస్ట్ సీట్లో ఉంటారు. బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు మీరు చేసుకోవాలి. కొన్ని బాధలు కూడా భరించే శక్తి కూడా మీలో పెంచుకోవాలి' అని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..