ఎంపీల నూతన నివాసాలకు కృష్ణా, గోదావరి నదుల పేర్లు
దిల్లీ:12 ఆగస్టు (హి.స.) పార్లమెంటు సభ్యుల కోసం దేశ రాజధానిలోని బాబా ఖడక్‌ సింగ్‌ మార్గ్‌లో 184 ఫ్లాట్లతో నిర్మించిన నాలుగు టవర్లను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. నదులను స్మరించుకుంటూ ఈ టవర్లకు కృష్ణా, గోదావరి, హుగ్లీ, కోసి అనే పేర్లను ప
ఎంపీల నూతన నివాసాలకు కృష్ణా, గోదావరి నదుల పేర్లు


దిల్లీ:12 ఆగస్టు (హి.స.) పార్లమెంటు సభ్యుల కోసం దేశ రాజధానిలోని బాబా ఖడక్‌ సింగ్‌ మార్గ్‌లో 184 ఫ్లాట్లతో నిర్మించిన నాలుగు టవర్లను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. నదులను స్మరించుకుంటూ ఈ టవర్లకు కృష్ణా, గోదావరి, హుగ్లీ, కోసి అనే పేర్లను పెట్టారు. ఈ సందర్భంగా మోదీ ఈ ప్రాంగణంలో సిందూర్‌ మొక్క నాటారు. అనంతరం భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande