దిల్లీ:12 ఆగస్టు (హి.స.) సింధూ నది జలాలను అడ్డుకోవడానికి ఆనకట్టలు కడితే పేల్చేస్తామని, తమ దేశ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగిన పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ ప్రేలాపనలపై భారత్ దీటుగా స్పందించింది. ‘అణు బెదిరింపులకు భయపడం. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోం’ అని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. అసీం మునీర్ ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీలతో మాట్లాడుతూ మరోసారి భారత్‌పై వ్యతిరేకత వెళ్లగక్కారు. ‘కశ్మీర్ మాకు ప్రాణంతో సమానం. అది భారత్‌లో అంతర్భాగం కాదు. కశ్మీర్ అసంపూర్ణ అంతర్జాతీయ ఎజెండా’ అని పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ