కర్నూలు, 12 ఆగస్టు (హి.స.)
మన శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పుల్లో గోర్ల రంగు, ఆకారంలో వచ్చే మార్పులు కూడా చాలా ముఖ్యం. వీటిని మనం పెద్దగా పట్టించుకోం.. కానీ ఇవి కొన్ని కీలకమైన ఆరోగ్య సమస్యలకు సిగ్నల్స్ కావచ్చు. మన గోర్లు మన ఆరోగ్యం గురించి చాలా విషయాలే చెబుతాయి. గోర్ల రంగు మార్పులు.. వాటి హెల్త్ సిగ్నల్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గోరుపై పసుపు చారలు.. సిగరెట్ తాగేవారికి ఇలా జరగొచ్చు. కానీ కొన్నిసార్లు ఇది లివర్ సంబంధిత జబ్బులకు కూడా సూచన కావచ్చు.
పొడవైన గీతలు లేదా లైన్స్.. ఇవి ఆర్థరైటిస్, పొట్ట సమస్యలు లేదా లివర్ పనితీరులో మార్పులు ఉన్నాయని చెప్పే సంకేతాలు.
తెల్లటి చారలు లేదా మచ్చలు.. ఇది శరీరంలో ప్రోటీన్ లోపం, జింక్ తక్కువగా ఉండటం లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని సూచించవచ్చు.
గోర్లు పూర్తిగా తెల్లగా మారితే.. ఇది లివర్ ఫెయిల్యూర్ లేదా శరీరంలోని ఇతర అవయవాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు.
గోర్లు పసుపు రంగులోకి మారితే.. ఇది జాండీస్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
గోర్ల రంగు మారినంత మాత్రాన ఏదో పెద్ద జబ్బు ఉందని కంగారు పడొద్దు. కానీ సడెన్‌గా గోర్ల రంగు మారినా లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మార్పులు కనిపించినా.. తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి