శ్రీశైలం జలాశయానికి భారీగా పెరిగిన వరద
శ్రీశైలం, 12 ఆగస్టు (హి.స.) ఎగువ ప్రాంతాల్లో, స్థానికంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Project) వరద పోటెత్తింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద క్రమంగా పెరుగుతుండటంతో ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండింది. ప్రాజెక్టు
. శ్రీశైలం జలాశయానికి వరద


శ్రీశైలం, 12 ఆగస్టు (హి.స.) ఎగువ ప్రాంతాల్లో, స్థానికంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Project) వరద పోటెత్తింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద క్రమంగా పెరుగుతుండటంతో ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. దీంతో అధికారులు నాలుగు స్పిల్ వే గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ కు 1,08,076 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35 వేల క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్ లో నెలరోజుల వ్యవధిలో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం ఇది మూడవసారి. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,02,456 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నాగార్జున సాగర్ కు కూడా వరద ప్రవాహం పెరుగుతుండటంతో.. 8 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande