ఖైదీలను విడుదల చేయాలి.. సుప్రీకోర్టు కీలక ఆదేశాలు
దిల్లీ:12 ఆగస్టు (హి.స.) శిక్షాకాలం పూర్తి చేసిన ఖైదీల విడుదలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. శిక్షా కాలం పూర్తి చేసిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హ
Supreme Court


దిల్లీ:12 ఆగస్టు (హి.స.)

శిక్షాకాలం పూర్తి చేసిన ఖైదీల విడుదలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. శిక్షా కాలం పూర్తి చేసిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హోమ్ సెక్రటరీలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పరిధిలో శిక్షా కాలాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా జైల్లో ఖైదీలు కొనసాగుతున్నారా అనే విషయాన్ని వెంటనే పరిశీలించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

అలాంటి ఖైదీలు ఇతర కేసుల్లో అవసరం లేకపోతే, వారిని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. శిక్షా కాలాన్ని (రివార్డు లేకపోయినా) పూర్తి చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాన్ని జాతీయ న్యాయ సేవా ప్రాధికార (NALSA) సభ్య కార్యదర్శికి పంపాలని, అక్కడి నుంచి రాష్ట్రాల్లోని జిల్లా న్యాయ సేవా సంస్థలకు పంపించాల్సిందిగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande