పులివెందుల బై ఎలక్షన్... విజయవాడలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద వైసీపీ ఆందోళన
విజయవాడ, 12 ఆగస్టు (హి.స.)కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందంటూ విజయవాడలోని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ అరాచకాలపై ఎన్నికల
వైసీపీ ఆందోళన


విజయవాడ, 12 ఆగస్టు (హి.స.)కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందంటూ విజయవాడలోని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ అరాచకాలపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు.

టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ యత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ... వారిని పోలింగ్ బూత్ లకు రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నేతలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande