క్రీడ కిరణ్ గ్రూప్ 1 అభ్యర్ధుల సర్టిఫికెట్ పరిశీలనకు ప్రకటన విడుదల
అమరావతి, 13 ఆగస్టు (హి.స.) :క్రీడా కోటా గ్రూప్‌-1 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అంశంపై ఏపీపీఎస్సీ మంగళవారం హడావిడిగా ప్రకటన విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు.. బుధవారం ఉదయం 11 గంట
క్రీడ కిరణ్ గ్రూప్ 1 అభ్యర్ధుల సర్టిఫికెట్ పరిశీలనకు ప్రకటన విడుదల


అమరావతి, 13 ఆగస్టు (హి.స.)

:క్రీడా కోటా గ్రూప్‌-1 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అంశంపై ఏపీపీఎస్సీ మంగళవారం హడావిడిగా ప్రకటన విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు.. బుధవారం ఉదయం 11 గంటలకు స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు విజయవాడలోని శాప్‌ కార్యాలయానికి రావాలని పేర్కొంది. దీంతో 37 మంది అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు రాకుంటే వారి అభ్యర్థిత్వం కోల్పోతారని హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande