ఇటలీ పౌరురాలికి ఓటు ఎలా వచ్చింది.. సోనియాగాంధీపై బీజేపీ ఎదురుదాడి
న్యూఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.) ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ యుద్ధం ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడికి దిగింది. అనర్హులు, అక్రమ ఓటర్లను తొలగిస్తుంటే రాహుల్గాంధీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియ
బీజేపీ ఎదురుదాడి


న్యూఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.)

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ యుద్ధం ప్రకటించింది.

తాజాగా కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడికి దిగింది. అనర్హులు, అక్రమ ఓటర్లను తొలగిస్తుంటే రాహుల్గాంధీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా తీవ్రంగా విమర్శించారు. సోనియాగాంధీ భారతీయ పౌరురాలు కాకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఓటు వేశారంటూ నిలదీశారు. ఇందుకు 1980లో ఓటరు జాబితాలో సోనియాగాంధీ పేరు ఉండడాన్ని ప్రశ్నించారు. అధికారికంగా సోనియాగాంధీ 1983, ఏప్రిల్ 30న భారతీయ పౌరురాలి అయితే.. అంతకంటే ముందుగా రెండు సార్లు ఓటర్ జాబితాలోకి పేరు ఎలా వచ్చిందని నిలదీశారు. ఇది అక్రమం కాదా? అని అడిగారు.

సోనియాగాంధీ.. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్నాక కూడా దాదాపు 15 సంవత్సరాలు వరకు ఇటలీ పౌరురాలిగానే ఉన్నారని.. ఆమె ఎందుకు భారతీయ పౌరసత్వం తీసుకునేందుకు ఇష్టపడలేదని ప్రశ్నించారు. పైగా అధికారికంగా భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే ఆమె పేరు ఓటరు జాబితాలో ఎందుకు ఉందన్నారు. ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని ప్రశ్నించారు. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం.. భారత పౌరుడు కాని వ్యక్తి ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి అనర్హుడు అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande