డ్రైవింగ్ రాని మైనర్ చేతిలో కార్ స్టీరింగ్.. ఇల్లందులో ప్రమాదం..
భద్రాద్రి కొత్తగూడెం, 13 ఆగస్టు (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బుధవారం కారు ప్రమాద సంఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ డ్రైవింగ్ రాకున్నా కారు తోలుతూ హల్చల్ చేశాడు. అతివేగంతో కారు అదుపుతప్పడంతో బస్తీలో ఎదురుగా వస్తున్న వాహన దారులు కారు
కారు ప్రమాదం


భద్రాద్రి కొత్తగూడెం, 13 ఆగస్టు (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బుధవారం కారు ప్రమాద సంఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ డ్రైవింగ్ రాకున్నా కారు తోలుతూ హల్చల్ చేశాడు. అతివేగంతో కారు అదుపుతప్పడంతో బస్తీలో ఎదురుగా వస్తున్న వాహన దారులు కారు పరిస్థితి గమనించి తప్పించుకున్నారు. ఇలా ముగ్గురు ద్విచక్ర వాహనదారులు పాదచారులు పలువురు భయాందోళనతో పరుగులు తీశారు. కారును ఆపాలని అరిసినప్పటికీ సదరు మైనర్ డ్రైవర్ ఆపకుండా అదే వేగంతో దూసుకెల్లడంతో చివరకు భజన మందిరం వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. వెంటనే మైనర్ డ్రైవర్ కారు నుంచి దూకి పరారయ్యాడు. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలతో భీతిలిపోయారు. విషయం తెలుసుకున్న కారు యజమాని సంఘటన స్థలానికి రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవింగ్ రాకుండా కారు ఎలా ఇస్తారని మా ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటని నిలదీశారు. పోలీసులు డ్రైవింగ్ రాకుండా వాహనాలు నడిపే డ్రైవర్లు వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande