తెలంగాణ, హనుమకొండ 13 ఆగస్టు (హి.స.) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల సమీపంలో బుధవారం వేకువజామున కల్వర్టును ఢీకొన్న సంఘటనలో లిక్కర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ దాస్, క్లీనర్ నరేష్ క్షేమంగా బయటపడ్డారు. సంగారెడ్డి నుండి హనుమకొండ డిపో కు పెట్టెలతో కూడిన బీర్లను లారీలో తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వాహనదారులు, ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. లారీలో ఉన్న లిక్కర్ బాటిల్స్ విలువ రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా. లిక్కర్ బాటిల్స్ అపహరణకు గురికాకుండా ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్, ఎస్సై తిరుపతి, సిబ్బంది ఖలీల్, లాల, రవీందర్, ముల్కనూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు