గుర్రం కొండ మహిళా ఏపీఎం పై వైకాపా నేతల దాడి చేశారు
అమరావతి, 13 ఆగస్టు (హి.స.) , : తాము చెప్పినట్లు వినలేదని, తమకు వ్యతిరేకంగా నివేదిక పంపారని కక్షగట్టిన వైకాపా నాయకులు ఓ మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడిన దారుణమిది. తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాద
గుర్రం కొండ మహిళా ఏపీఎం పై వైకాపా నేతల దాడి చేశారు


అమరావతి, 13 ఆగస్టు (హి.స.)

, : తాము చెప్పినట్లు వినలేదని, తమకు వ్యతిరేకంగా నివేదిక పంపారని కక్షగట్టిన వైకాపా నాయకులు ఓ మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడిన దారుణమిది. తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు, సాక్షుల కథనం.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ-3 మహిళా సమాఖ్యకు సంఘమిత్రగా, అదే ప్రాంతంలో ఆశా కార్యకర్తగా తలారివాండ్లపల్లెకు చెందిన నల్లకాసుల శేఖర్‌ భార్య నాగరాజమ్మ 15 ఏళ్లుగా పని చేస్తున్నారు. రెండు ఉద్యోగాలు చేస్తూ ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేస్తున్నారని ఇటీవల తెదేపా నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివరాలు ఆరా తీసిన గుర్రంకొండ ఏపీఎం రజిని.. నాగరాజమ్మ రెండు ఉద్యోగాలు చేస్తున్నది వాస్తవమేనని నివేదిక పంపించారు. పీహెచ్‌సీ వైద్యులు కూడా ఇదే మాదిరిగా నివేదిక ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande