తెలంగాణ, సిద్దిపేట. 13 ఆగస్టు (హి.స.)
యూరియా కోసం అన్నదాతలు నడిరోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు యూరియా ఇవ్వలేని చేతగాని, దద్దమ్మ ప్రభుత్వాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుందని హరీశ్రావు వ్యాఖ్యానించారు.
సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద బుధవారం ఎరువుల కోసం క్యూలో బారులు తిరిన రైతులను చూసి మాజీ మంత్రి హరీష్ రావు ఆగారు. ఈ సందర్భంగా వారిని పలుకరించగా.. ఉదయం 5 గంటల నుండి ఇక్కడే ఉంటున్నాం.. ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారు. ఆధార్ కార్డు, ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని హరీశ్రావుతో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు