రెండు తెలుగు. రాష్ట్రాల వ్యాప్తంగా గత వారం.నుంచి..భారీ వర్షాలు
అమరావతి, 13 ఆగస్టు (హి.స.) రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రాబోయే మూడు రోజులు
రెండు తెలుగు. రాష్ట్రాల వ్యాప్తంగా గత వారం.నుంచి..భారీ వర్షాలు


అమరావతి, 13 ఆగస్టు (హి.స.)

రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రాబోయే మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande