హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో
సైబరాబాద్ పోలీసులు దొంగలను పట్టుకున్నట్లు తెలుస్తుంది. నిన్న ఉదయం చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షాప్లోకి మాస్క్లు వేసుకుని, హెల్మెట్లు ధరించి చొరబడిన దొంగలు అక్కడ ఉన్న సిబ్బందిని తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే..
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. తీవ్ర గాలింపు చేపట్టిన పోలీసులు పటాన్ చెరు సర్వీసు రోడ్ లో వెళ్తున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. అలాగే సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆరుగురు దొంగలు వేర్వేరు మార్గాల్లో రెండు బైక్లపై ముఖాలకు మాస్క్, తలపై క్యాపు, చేతులకు గ్లాజులు వేసుకొని వెళ్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. దొంగతనం చేసిన బైక్ లనే దోపిడీకి వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఖజానా జ్యువెలరీ షాప్ లో దోపిడీకి పాల్పడిన దొంగలు పట్టుబడినట్లు పోలీసులు ధృవీకరించలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..