తెలంగాణ, నల్గొండ. 13 ఆగస్టు (హి.స.) నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. కాగా అధికారులు బుధవారం 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1,92,648 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 309.95 టీఎంసీలుగా ఉంది. సాగర్కు ఇన్ఫ్ల 1,74,533 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు