బిగ్బీ షోకి ఆపరేషన్ సిందూర్ మహిళా ఆఫీసర్లు.. నెటిజన్ల విమర్శలు
న్యూఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.) వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషి లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారతీయ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధి
ఆపరేషన్ సిందూర్


న్యూఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.)

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషి లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారతీయ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని దేశం దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఈ మహిళా అధికారులు ఓ టీవీ షోలో కనిపించనున్నారు.

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి స్పెషల్ ఎపిసోడ్కు మహిళా అధికారులను ఆహ్వానించారు. ఈ షోలో వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీతోపాటూ కమాండర్ ప్రేరణ డియోస్థలీ కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ అనుభవాలను బిగ్బీతో వారు పంచుకున్నారు. పూర్తి ఎపిసోడ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న టెలికాస్ట్ కానుంది. అయితే, మహిళా ఆఫీసర్లు ఈ షోకు రావడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. పీఆర్ కోసం సాయుధ దళాలను ఉపయోగించుకుంటున్నారంటూ మండిపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande