సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్.. పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.) సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులకు గుడ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలపై మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు గాను గుజరాత్ నుంచి రాష్ట్రానికి 37,530 బ్యాలెట్ బ్యాక్సులు వచ్చాయి. అయితే, అధికారులు న
పంచాయతీ ఎన్నికలు


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ

ఆశావహులకు గుడ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలపై మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు గాను గుజరాత్ నుంచి రాష్ట్రానికి 37,530 బ్యాలెట్ బ్యాక్సులు వచ్చాయి. అయితే, అధికారులు నేడు లేదా రేపు జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మరో వైపు విద్య, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై ఈ నెల 18న కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు రేపు ఆయన పంచాయతీ రాజ్ అధికారులతో భేటీ అవుతుండటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande