కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. ఇద్దరికి రిమాండ్
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 13 ఆగస్టు (హి.స.) కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సుజాతనగర్ మండలంలోని కోయగూడెం గ్రామానికి చెందిన జరుపుల బిక్కులా
ఇద్దరికీ రిమాండ్


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 13 ఆగస్టు (హి.స.)

కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా

తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సుజాతనగర్ మండలంలోని కోయగూడెం గ్రామానికి చెందిన జరుపుల బిక్కులాల్, లక్ష్మణ్ 2018 నాటి ఓ కేసులో నిందితులుగా ఉన్నారు.

ఆ కేసులో కొత్తగూడెం సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు నిందితులను ఎస్సై ఎం రమాదేవి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande