చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీల కలకలం
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.) చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలతో దొంగలు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న రెండు దేవాలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లిన దొంగలు మంగళవారం ఉదయం ఏకంగా ఖజానా జ్యువెలరీ షాప్లోనే భారీ చోరీకి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్య
దొంగతనాలు


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలతో దొంగలు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న రెండు దేవాలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లిన దొంగలు మంగళవారం ఉదయం ఏకంగా ఖజానా జ్యువెలరీ షాప్లోనే భారీ చోరీకి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటన మరువక ముందే మంగళవారం రాత్రి చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి గ్రామం సేవాలాల్ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీని చోరీ చేశారు. చోరీ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఉదయం చోరీ విషయం తెలుసుకున్న స్థానికులు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. హుండీ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస చోరీల నేపథ్యంలో పోలీసుల వైఫల్యం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande