హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు
విచారణను సుప్రీంకోర్టు ఆరు వారాలు వాయిదా వేసింది. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదేశించారు. పర్యావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను తాము అభినందిస్తున్నామని, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు.
పర్యావరణాన్ని సమతుల్యం చెయ్యాలని, పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవాయ్ ఆదేశించారు. దాంతో సమగ్ర ప్రణాళికను ప్రతిపాదించడానికి 6 వారాల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టును కోరారు.
దాంతో కోర్టు కేసు తదుపరి విచారణను 6 వారాలపాటు వాయిదా వేసింది. పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే.. అన్ని ఫిర్యాదులను ఉపసంహరిస్తామని జస్టిస్ గవాయ్ తెలిపారు. తన రిటైర్మెంట్ లోపల కేసులో సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్