మధ్యతరగతికి భారీ ఊరట.. ఎనిమిదేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం..!
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.) మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించింది. దేశంలో రిటైల్ (చిల్లర) ద్రవ్యోల్బణం గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఈ ఏడాది జూలై నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.55 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వం విడుద
రిటైల్ ద్రవ్యోల్బణం..!


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించింది. దేశంలో రిటైల్ (చిల్లర) ద్రవ్యోల్బణం గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఈ ఏడాది జూలై నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.55 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు స్పష్టంచేశాయి. 2017 జూలై తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి.

జూన్ నెలలో 2.10 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్క నెలలోనే 55 బేసిస్ పాయింట్లు తగ్గి 1.55 శాతానికి పడిపోయింది. ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడమే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా మైనస్ 1.76 శాతానికి పడిపోయింది. 2019 జనవరి తర్వాత ఆహార ధరలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా పప్పుధాన్యాలు, కూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు, చక్కెర లాంటి నిత్యావసరాల ధరలు దిగిరావడం సామాన్యుడికి పెద్ద ఉపశమనం కలిగించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande