అమరావతి, 13 ఆగస్టు (హి.స.)
వైఎస్సార్ కడప: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు రెండు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు ప్రజలు తరలివచ్చారు. వీటి పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్ జరిగింది. ఈ రెండు స్థానాలను కూటమి, వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మంగళవారం పులివెందులలో 76.44 శాతం, ఒంటిమిట్టలో 81.53 శాతం ఓటింగ్ నమోదైంది. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, మారెడ్డి లతారెడ్డి, హేమంత్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ