శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.) ఈ నెల 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలు వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలకు కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో నిఘా వర్గాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో
శంషాబాద్ ఎయిర్పోర్ట్


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

ఈ నెల 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలు వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలకు కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో నిఘా వర్గాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ కారణంగా సందర్శనకు అనుమతి తాత్కలికంగా ఎత్తివేశారు. అలాగే పలు అనుమానితుల పట్ల సీఐఎస్ఎఫ్ అధికారుల ప్రత్యేక నిఘా పెట్టారు. విదేశాల నుంచి హైదరాబాద్కు నేరుగా అనేక విమానాలు వస్తుండటంతో ముందస్తు భద్రతలో భాగంగా.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో ఎయిర్ పోర్టు అంతటా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ హైఅలర్ట్ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande