అమరావతి, 13 ఆగస్టు (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. పాపట్‌పల్లి - డోర్నకల్ మధ్య ట్రాక్ మరమ్మతు పనులు కొనసాగుతున్నందున ఆగస్టు 14 నుంచి ఆ రూట్లో ఐదు రోజుల పాటు 10 ట్రైన్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కొన్ని రైళ్లు పాక్షిక రద్దుతో పాటు నడిచే వేళల్లో మార్పులు మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికులు పూర్తి వివరాల కోసం 139కు డయల్ చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వేస్ అధికారులు తెలిపారు.
రద్దయిన ట్రైన్ల పూర్తి వివరాలు ఇవే..
1. డోర్నకల్ - విజయవాడ (ట్రైన్ నెం. 67767)
2. విజయవాడ - డోర్నకల్ (ట్రైన్ నెం. 67768)
3. కాజీపేట - డోర్నకల్ (ట్రైన్ నెం. 67765)
4. డోర్నకల్ - కాజీపేట (ట్రైన్ నెం. 67766)
5. విజయవాడ - సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 12713)
6. సికింద్రాబాద్ - విజయవాడ (ట్రైన్ నెం. 12714)
7. విజయవాడ - భద్రాచలం రోడ్ (ట్రైన్ నెం. 67215)
8. భద్రాచలం రోడ్ - విజయవాడ (ట్రైన్ నెం. 67216)
9. గుంటూరు - సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 12705)
10. సికింద్రాబాద్ - గుంటూరు (ట్రైన్ నెం. 12706)
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి