అమరావతి, 13 ఆగస్టు (హి.స.) కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది (Krishna river) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ఎన్నడూ లేని విధంగా నదిపై ఉన్న అన్ని డ్యామ్ గేట్లను ఎత్తిన అధికారులు లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తుండటంతో మరోసారి కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో జూరాల 12, శ్రీశైలం 4, నాగార్జున సాగర్ 24, టైల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులు ఎత్తి పెట్టారు. దీంతో దిగువన విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజికి భారీ వరద వచ్చి చేరుంది.
దీనికి తోడు ఖమ్మం, జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పోర్లడంతో.. బెజవాడ (Bejwada) వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) గేట్లు అన్ని ఎత్తి పెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి