రజినీకాంత్-నాగార్జున కూలీ, రజినీకాంత్‌కు CM చంద్రబాబు గుడ్ న్యూస్
అమరావతి, 13 ఆగస్టు (హి.స.) రజినీకాంత్-నాగార్జున కూలీ, హృతిక్ రోషన్-ఎన్టీఆర్ వార్-2 చిత్రాలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కూలీ సినిమా సినిమా విడుదల రోజు(14/08/2025) ఉదయం 5 గంటల
రజినీకాంత్-నాగార్జున కూలీ, రజినీకాంత్‌కు CM చంద్రబాబు గుడ్ న్యూస్


అమరావతి, 13 ఆగస్టు (హి.స.) రజినీకాంత్-నాగార్జున కూలీ, హృతిక్ రోషన్-ఎన్టీఆర్ వార్-2 చిత్రాలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కూలీ సినిమా సినిమా విడుదల రోజు(14/08/2025) ఉదయం 5 గంటల షోకు అనుమతి ఇచ్చారు. రెండు సినిమాలకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 టికెట్ రేట్స్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు చిత్రాలు ఆగష్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్నాయి. కూలీలో రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, పూజా హెగ్డే వంటి అగ్ర తారలు నటిస్తుండగా.. వార్‌-2లో హృతిక్, ఎన్టీఆర్, కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల కోసం మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande