అమరావతి, 13 ఆగస్టు (హి.స.)ఓటమిని అంగీకరించలేక వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మంత్రి సవిత ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జనాలు ఓటు వేయలేదని గ్రహించే జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి రీపోలింగ్ అడిగార ని అన్నారు. వాళ్లే రీపోలింగ్ అడిగి మళ్లీ ఇప్పుడు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రజలే మిమ్మల్ని బహిష్కరించారనే విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని అభిప్రాయపడ్డారు. ఎలాగో ఓడిపోతామని తెలిసి వైసీపీ లేనిపోని సాకులు చెబుతోంది అన్నారు. రీపోలింగ్ అడిగి, మళ్లీ ఇప్పుడు బహిష్కరిస్తున్నట్లు అవినాష్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. బాయ్ కాట్ కాదు.. బావిలో పడి చావండి అంటూ ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు చేశారు ఏపీని ఐపీ చేసిన ఘనత జగన్ దైతే మో దీ సహకారంతో రాష్ట్రాన్ని వీఐపీ చేస్తున్న ఘనత చంద్రబాబుది అని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి