అమరావతి, 13 ఆగస్టు (హి.స.) 'రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబుతో రాహుల్ హాట్ టచ్ లో ఉన్నాడు.. రేవంత్ ద్వారా బాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉంటారు..' పని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో జరిగిన జడ్పిటిసి ఎన్నికలపై ఆయన ఈరోజు తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడాడు. 'బాబు గురించి మాణిక్యం ఠాకూర్ ఒక్కకామెంట్ ఎందుకు చేయరు, ఏపీలో ఎన్నో స్కామ్ లు జరుగుతున్నాయి, అమరావతి నిర్మాణం పెద్ద స్కాం.. కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు?' అని జగన్ ప్రశ్నించారు. ఏపీలో 2024 ఎన్నికల నాటికి ,.. లెక్కింపు సమయానికి 12.5 ఓట్లు పెరిగాయన్నారు. ఓటింగ్తర్వాత 48 లక్షల ఓట్లు పెరిగాయని ఇది ఎలా సాధ్యం అన్నారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు చంబల్ వ్యాలీలో బందిపోట్లను మరిపించారరని, ఆ బందిపోట్ల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, పులివెందులలో నిన్న జరిగిన ఘటనలే దీనికి నిదర్శనమన్నారు. వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. 15 పోలింగ్ బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు కూర్చోనీయలేదని ఆరోపించారు. ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు. పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ సమీప బంధువని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి