అలర్ట్.. తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
ముంబై, 16 ఆగస్టు (హి.స.) బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.. ఇటీవల బంగారం ధర పది గ్రాములు ఏకంగా లక్షా 3 వేలు దాటింది.. వెండి కూడా అదే బాటలో కొనసాగుతోంది. వాస్తవానికి బంగారం, వెండి ధర
Gold


ముంబై, 16 ఆగస్టు (హి.స.)

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి.. ఇటీవల బంగారం ధర పది గ్రాములు ఏకంగా లక్షా 3 వేలు దాటింది.. వెండి కూడా అదే బాటలో కొనసాగుతోంది. వాస్తవానికి బంగారం, వెండి ధరలలో నిరంతరం మార్పు ఉంటుంది. కొన్నిసార్లు పెరుగుతూ, మరికొన్ని కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి.. గత నాలుగు రోజుల క్రితం రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర.. తగ్గుతూ వస్తోంది.. ఆగస్టు 16 శనివారం ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశియంగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది.

దేశియంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 మేర ధర తగ్గి.. రూ.1,01,230 గా ఉంది..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర ధర తగ్గి.. రూ.92,790 కి చేరుకుంది.

వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,16,200లుగా ఉంది.

అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,01,230 ఉంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,790 ఉంది. కిలో వెండి ధర రూ.1,26,200 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande