దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. విజయవాడలో తులం ఎంతో తెలుసా?
ముంబై, 18 ఆగస్టు (హి.స.) బంగారం ధరలు, వెండి ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు.. సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి దేశీయ మార్కెట్‌కు చౌకగా మారింది. MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.
Gold


ముంబై, 18 ఆగస్టు (హి.స.)

బంగారం ధరలు, వెండి ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు.. సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి దేశీయ మార్కెట్‌కు చౌకగా మారింది. MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1900 కంటే ఎక్కువ తగ్గింది. ఆగస్ట్‌ 18వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,880 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,890 వద్ద ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 వద్ద ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande