స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ఫీజు పెంపు..ఫెస్టివల్ సీజన్‌లో వినియోగదారులపై ప్రభావం
ముంబై, 16 ఆగస్టు (హి.స.) మీకు ఇటీవల గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే బిల్ కొంచెం ఎక్కువగా అనిపించిందా? దీనికి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియాలో అగ్రగామిగా ఉన్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ, పలు ప్రాంతాల్లో త
స్విగ్గీ ప్లాట్‌ఫారమ్ ఫీజు పెంపు..ఫెస్టివల్ సీజన్‌లో వినియోగదారులపై ప్రభావం


ముంబై, 16 ఆగస్టు (హి.స.)

మీకు ఇటీవల గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే బిల్ కొంచెం ఎక్కువగా అనిపించిందా? దీనికి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియాలో అగ్రగామిగా ఉన్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ, పలు ప్రాంతాల్లో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ. 14కి పెంచింది (Swiggy Increases Platform Fee). ఇది దాదాపు 17% పెంపు.

కానీ ఇది తాత్కాలిక చర్య అని కంపెనీ చెబుతోంది. ఫెస్టివల్ సీజన్ సమయంలో కొన్ని హై డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఆర్డర్లను హ్యాండిల్ చేయడం కోసం ఈ ఫీజు పెంపు చేసినట్టు తెలుస్తోంది. ఇది Uber, Ola లాంటి సర్జ్ ప్రైసింగ్ విధంగా అనిపించవచ్చు.

స్విగ్గీ చెబుతోందే ఇది స్థిరమైన మార్పు కాదు. పండుగల సమయంలో మాత్రమే అమలవుతోంది. దీని తర్వాత అదే విధంగా కొనసాగుతుందా లేదా అనేది ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఫీజు 2023లో మొదట ప్రవేశపెట్టినప్పుడు కేవలం రూ. 2 మాత్రమే. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అది రూ. 14కి చేరింది, అంటే 600% పెరిగింది. ఇది చిన్నదిగా అనిపించిన ఫీజు ఇప్పుడు బాగా పెరిగింది. ప్రత్యర్థి జొమాటో మాత్రం తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఇప్పటికీ రూ. 10 వద్ద కొనసాగిస్తోంది.

ఇది ఒక్క స్విగ్గీ విషయంలోనే కాదు. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగంలో మొత్తం చూస్తే Zepto, BigBasket, Instamart, Blinkit లాంటి సంస్థలు కూడా ప్లాట్‌ఫారమ్ లేదా హ్యాండ్లింగ్ ఫీజులను మెల్లిగా పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫీజులు రూ. 9 నుంచి రూ. 15 వరకు ఉన్నాయి. ఇది సగటు ఆర్డర్ విలువలో ఇది 1% నుంచి 3% వరకూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఫీజులు పెరిగినా కూడా వినియోగదారుల ఆర్డర్లు తగ్గడం లేదు.

పేర్లు మారినా ఉద్దేశం ఒకటే

ఒక్కో యాప్ ఒక్కో పేరుతో ఫీజులను చూపిస్తుంటుంది. హ్యాండ్లింగ్ ఫీజు, కన్వీనియెన్స్ ఛార్జ్ లేదా స్మాల్ ఆర్డర్ ఫీజు. వీటి ఉద్దేశం మాత్రం ఒక్కటే, రెవెన్యూ పెంచుకోవడం. స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీలు ఒక్కో ఆర్డర్ పై రూ. 5 ఫీజు పెంచినా, లక్షల ఆర్డర్ల స్థాయిలో చూస్తే ఇది కోట్ల ఆదాయంగా మారుతుంది. గతంలో ఈ కంపెనీలు డిస్కౌంట్లు, ఫ్రీ డెలివరీలతో కస్టమర్లను ఆకర్షించేవి. ఇప్పుడు వారు ప్రాఫిట్ చేయాలనే దిశగా మారుతున్నట్లుగా అనిపిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande