హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.)
మా ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలో ఎలీ లిల్లీ (Eli Lilly) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈ రోజు చరిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఇందుకు ఇవాల్టి ఈ కార్యక్రమమే తిరుగులేని నిదర్శనమని చెప్పారు. మా ప్రభుత్వ చిత్తశుద్ధి, దృష్టికోణం, కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. ఈ విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించి, మంత్రి శ్రీధర్ బాబు, జయేశ్ రంజన్, పాలుపంచుకున్నారని, ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఇది తెలంగాణ రైజింగ్ 2047 మరొక ముఖ్యమైన అడుగు అని అన్నారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..