ఏపి. కేబినెట్ సమావేశంలో. పలు సంచలన నిర్ణయాలు
అమరావతి, 6 ఆగస్టు (హి.స.) సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీ
ఏపి. కేబినెట్ సమావేశంలో. పలు సంచలన నిర్ణయాలు


అమరావతి, 6 ఆగస్టు (హి.స.)

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని మంత్రులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనందున పని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande