మహబూబ్నగర్, 6 ఆగస్టు (హి.స.)
లంచం తీసుకుంటూ ఇరిగేషన్ సబ్ డివిజన్ -1 అధికారి బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. 150 గజాల ఒక స్థలానికి సంబంధించి ఎన్బీసీ పొందేందుకు వీలుగా అవసరమైన అనుమతి పత్రాల కోసం ఆ స్థలం యజమాని ఇరిగేషన్ అధికారులను సంప్రదించాడు. అందుకుగాను ఇరిగేషన్ ఏఈ మహమ్మద్ ఫయాజ్ రూ.ఐదు వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ. మూడు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు.
ఆ తర్వాత ఆ స్థలం యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు వ్యూహం మేరకు ఏసీబీ అధికారి సీహెచ్ బాలకృష్ణ వారి బృందం ఇంటి యజమాని నుండి ఏఈ మూడు వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారం రోజులు తిరగకుండగానే భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ కళ్యాణ లక్ష్మి దరఖాస్తు ఆమోదం కోసం 5000 డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన ఘటన మరువకముందే.. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ ఏసీబీకి చిక్కడం మహబూబ్ నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..