శిబూ సోరెన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.) జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ.. గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమతిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబూ సోరెన్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారుల ఆగడ
శిబూ సోరెన్ మృతి


హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.)

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ..

గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమతిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబూ సోరెన్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరులోనూ శిబు సోరెన్ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు శిబూ సోరెన్ ఎల్లప్పుడూ ఆయన మద్దతు తెలిపేవారని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైతం చివరి వరకు దన్నుగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఆదివాసీ సమాజానికి గురూజీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ఎనిమిది సార్లు లోక్సభ ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, జార్ఖండ్ సీఎంగా ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు. శిబూ సోరెన్ మృతి పట్ల ఆయన కుమారుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande