హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.)
కల్వకుంట్ల కవిత దీక్షపై కాంగ్రెస్
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో దీక్ష చేయడం వల్ల ఏం ఉపయోగం అని మండిపడ్డారు ఆది శ్రీనివాస్. నిరాహార దీక్ష చేసే ముందు కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదం కాకుండా అత్తామామల ఆశీర్వాదాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి ? అంటూ నిలదీశారు. ఆమెను అణిచివేస్తున్న ఆ పెద్ద లీడర్లు ఎవరో కవిత చెప్పాలని చురకలు అంటించారు. దేవుడు చుట్టూ ఉన్న ఆ దెయ్యాలు ఎవరు? అని ప్రశ్నించారు. కేసీఆర్ తో కలిసి కవిత ఢిల్లీలో ధర్నా చేస్తే బీసీల కోసం కొట్లాడినట్లు అవుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..