హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్లో సోమవారం మధ్యాహ్నం నుండి పలుచోట్ల వర్షం కురుస్తోంది.
ఉప్పల్, రామంతాపూర్, నాచారం, తార్నాక, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, , అమీర్పేట, మధురానగర్, బోరబండ, యూసుఫ్గూడలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఎస్ఆర్నగర్, ఎర్రగడ్డ, సనత్నగర్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కండ, ఖైరతాబాద్, లక్షీకపూరల్, మాదాపూర్, కూకట్పల్లి, హైదర్నగర్, వివేకానందనగర్, హిమాయత్నగర్, కోఠి, సుల్తాన్బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, కాప్రా, జియాగూడ పరిసర ప్రాంతాల్లో వానపడింది. ఫిలింనగర్, ఎల్బీనగర్, వనస్థలీపురం, నాగోల్, మల్కాజ్గిరి, జవహర్నగర్, కాప్రాలో భారీ వర్షం కురిసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పలుచోట్ల నీరు నిలువడంతో ఇబ్బందిపడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ జీహెచ్ఎంసీ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పింది. వర్షాలతో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రత్తమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..