హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.) జర్నలిజం ముసుగులో ఎవడెవడో
వస్తున్నాడని, పొట్టకోస్తే అక్షరం ముక్క కూడా రానివాళ్లు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని చురకలంటించారు.
తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందని చెప్పారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమేనని విమర్శించారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్