కేబినెట్లో ఆర్డినెన్స్ తెచ్చయినా బీసీ బిల్లును అమలు చేస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తెలంగాణ, కరీంనగర్. 4 ఆగస్టు (హి.స.) బీసీ బిల్లుకు అన్ని పార్టీల ఆమోదంతోనే తీర్మానం చేసి బీసీ బిల్లును కేంద్రానికి పంపించామని, ఈ బిల్లుకు కేంద్రం ఆమోదం లభించకపోతే క్యాబినెట్ మీటింగ్ లో అయినా ఆర్డినెన్స్ తెచ్చైనా బీసీ బిల్లును రాష్ట్రంలో అమలు చేస్తా
మంత్రి అడ్లూరి


తెలంగాణ, కరీంనగర్. 4 ఆగస్టు (హి.స.)

బీసీ బిల్లుకు అన్ని పార్టీల

ఆమోదంతోనే తీర్మానం చేసి బీసీ బిల్లును కేంద్రానికి పంపించామని, ఈ బిల్లుకు కేంద్రం ఆమోదం లభించకపోతే క్యాబినెట్ మీటింగ్ లో అయినా ఆర్డినెన్స్ తెచ్చైనా బీసీ బిల్లును రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ బిల్లు అమలైతే ఎక్కడ తమ అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు పేరు వస్తుందో అని ప్రతిపక్షాలు బీసీ బిల్లు పై విమర్శలు చేస్తున్నాయని అన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు ఏమి చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కట్టి ఆ నీటిని పంప్ హౌసుల ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు నీటిని తరలించారని ఆరోపించారు. సాగు నీటి విషయంలో కరీంనగర్ జిల్లాకు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లు చర్చకు వస్తే మేము సిద్దమని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande