ముచ్చటే లేదు.. బనకచర్లను అడ్డుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్
తెలంగాణ, నల్గొండ. 4 ఆగస్టు (హి.స.) నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం
మంత్రి కోమటిరెడ్డి


తెలంగాణ, నల్గొండ. 4 ఆగస్టు (హి.స.)

నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పి.చంద్రఘోష్ రిపోర్టు ప్రభుత్వానికి అందిందని అన్నారు. నివేదికపై బ్రీఫ్ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి కేబినెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు.. బీఆర్ఎస్ (కే), (హెచ్),(ఎస్) (కేటీఆర్, హరీశ్ రావు, చంద్రశేఖర్ రావు)గా చీలడం ఖాయమని జోస్యం చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ కూతురు కవిత ధర్నా చేయడం పెద్ద జోక్ అని కామెంట్ చేశారు. ఇక నారా లోకేశ్ ఓ పిల్లాడిలా మాట్లాడుతున్నాడని.. ఏ మాత్రం రాజకీయ అవగాహ లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande