హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.)
గత ప్రభుత్వంలో శాసనసభ ఎన్నికల
సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులతోపాటు ముఖ్య నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణల ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందుకు విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో, అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలు, నాయకులపై ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజానిజాలపై స్పష్టత రాబట్టేందుకు సెట్ అడుగులు వేగంగా విచారణ చేపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్