హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.)
గులాబీ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇవాళ ఉదయం నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరుగుతుంది. ఉదయమే మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అలాగే ప్రశాంత్ రెడ్డి... అందరూ నేతలు... కెసిఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఉదయం నుంచి కేసీఆర్ ఈ అందరి మాజీ మంత్రులతో..... కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ కూడా... కెసిఆర్ ఫాం హౌస్ కి వెళ్లారు. ఉన్నఫలంగా సమాచారం రావడంతో.. హుటాహుటిన ఫామ్ హౌస్ వెళ్లారు కేటీఆర్. ఈ సందర్భంగా... కాలేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ పై... కెసిఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కల్వకుంట్ల కవిత... నిర్వహిస్తున్న దీక్షపై కూడా... ఆరా తీస్తున్నారట కేసీఆర్. దీంతో కెసిఆర్ ఫామ్ హౌస్ లో జరుగుతున్న సమావేశం... హాట్ టాపిక్ అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..