కన్నెపల్లి పంపహౌస్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట
జయశంకర్ భూపాలపల్లి, 4 ఆగస్టు (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేసి ఇతర ప్రాజెక్టులు, రిజర్వేయర్లు, చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ''చలో కన్నెపల్లి''కి పిలుపునిచ్చింది. మాజీ ఎంపీ బోయ
కన్నెపల్లి పంప్ హౌస్


జయశంకర్ భూపాలపల్లి, 4 ఆగస్టు (హి.స.)

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేసి ఇతర ప్రాజెక్టులు, రిజర్వేయర్లు, చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 'చలో కన్నెపల్లి'కి పిలుపునిచ్చింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ నేతృత్వంలో చేపడుతోన్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. అయితే, కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోటార్లు ఆన్ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పంప్ హౌస్ను ముట్టడించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారికి అడ్డకున్నారు. దీంతో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మందుకు వళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి జఠిలం అవుతుండటంతో అదనపు పోలీసు బలగాలు కన్నెపల్లి పంపహౌస్కు చేరుకుంటున్నాయి. మరోవైపు మోటార్లు ఆన్ చేస్తేనే అక్కడి నుంచి తాము కదులుతామని బీఆర్ఎస్ శ్రేణులు పంప్ హౌస్ బైఠాయించి నిరసన తెలుపుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande