తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 4 ఆగస్టు (హి.స.)
బీసీ రిజర్వేషన్ తో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు తీసుకురావడానికే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ధర్నా చేస్తున్నామని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
సోమవారం భువనగిరిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ బీసీల రిజర్వేషన్లపైన మొదటి నుంచి బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారని, బీసీల పట్ల బీజేపీ పార్టీకి ప్రేమ గాని, ఆదరణ లేదని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, మంత్రి కిషన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీల పట్ల కిషన్ రెడ్డికి ఎందుకు వివక్ష అని సూటిగా ప్రశ్నిస్తున్నట్లుగా చెప్పారు. ముస్లింలు సాకుగా చూపించి బీసీ బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధనకై పన్నెండు వందల మంది నాయకులు ట్రైన్ ద్వారా ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్లు బిల్లు యావత్ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారిందన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించామని, యాభై శాతం క్యాబ్ ను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు పడుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు