దిల్లీ: 5 ఆగస్టు (హి.స.)
ప్రధాని మోడీ ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా అమిత్ షా కూడా సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పారు. ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను మోడీ సొంతం చేసుకున్నారు. తాజాగా అమిత్ షా కూడా ఆగస్టు 5తో సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను అమిత్ షా సొంతం చేసుకున్నారు.
కేంద్రంలో ఎక్కువ కాలం హోంమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అమిత్ షా మంగళవారం రికార్డును బద్దలు కొట్టారు. బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ఱ అద్వానీ రికార్డ్‌ను ఆగస్టు 5న అమిత్ షా బద్దలు కొట్టారు. అద్వానీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్ ఆరు సంవత్సరాలకు పైగా హోం మంత్రి పదవిని నిర్వహించారు. మోడీ 1.0 పాలనలో హోం మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ఐదు సంవత్సరాలు పని చేశారు. తాజాగా అమిత్ షా.. ఆరు సంవత్సరాల 64 రోజుల పాటు హోంమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ