గంగోత్రి, 6 ఆగస్టు (హి.స.)ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు, క్లౌడ్ బరస్ట్‌ల వేళ 28 మంది పర్యాటకుల బృందం ఆచూకీ గల్లంతైంది. వీరందరూ కేరళకు చెందినవారిగా తేలింది. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన వారు కాగా.. మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు.
ఈ బృందంలోని ఓ జంట బంధువు మీడియాతో మాట్లాడుతూ వారితో మాట్లాడి ఒక రోజు గడిచిందన్నారు. తాము మాట్లాడినప్పుడు ‘‘ఉత్తరకాశీ నుంచి ఉదయం 8.30కు గంగోత్రికి బయల్దేరినట్లు వెల్లడించారు. వారి మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ తర్వాత నుంచి వారితో ఎటుంటి కాంటాక్టు లేదు. ఫోన్లలో బ్యాటరీ అయిపోయిందా.. లేక వారున్నచోట సిగ్నల్ లేదా అనేది అర్థం కావడంలేదు’’ అని పేర్కొన్నారు. హరిద్వార్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ 10 రోజులపాటు ఉత్తరాఖండ్ ట్రిప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు