ప్రస్తుతం సంఘర్షణలతో నిండిన ప్రపంచానికి హిందూయిజం అవసరం
భాగవత్‌
Mohanji


హైదరాబాద్, 6 ఆగస్టు (హి.స.)

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పలు యుద్ధాల గురించి ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (RSS chief) ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం సంఘర్షణలతో నిండిన ప్రపంచానికి హిందూయిజం (Hinduism) అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అన్ని రకాల వైవిధ్యాలను ఎలా అంగీకరించాలి? ఎలా పాటించాలనే విషయాన్ని హిందూయిజం మాత్రమే ప్రపంచ దేశాలకు నేర్పుతుందన్నారు. సంఘర్షణలను ఎలా నియంత్రించాలో ప్రపంచ దేశాలకు తెలియకపోవడం వల్లే రోజురోజులు ఘర్షణలు తీవ్ర రూపం దాలుస్తున్నాయని భాగవత్‌ అన్నారు. ధర్మాన్ని బోధించే హిందూయిజాన్ని పాటించడం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు.

భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటించగలిగే జీవిన విధానాన్ని హిందూ సంస్కృతీ సంప్రదాయాలు అలవాటు చేస్తాయని భాగవత్‌ (Mohan Bhagwat) తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande