తాటి బెల్లం అంటే తక్కువగా చూడకండి..? పోషకాలు, లాభాలు తెలిస్తే..
కర్నూలు, 5 ఆగస్టు (హి.స.) తాటి బెల్లం.. ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. అందులో భాగంగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల పట్ల అధిక శ్రద్ధ పెడుతున్నారు. అలాంటి ఆహారాల్లో ఒకటి తాటి బెల్లం. ఈ బెల్లం వినియోగం బాగా పెరిగింది. పోషకవిలువలు పుష్
తాటి బెల్లం అంటే తక్కువగా చూడకండి..? పోషకాలు, లాభాలు తెలిస్తే..

కర్నూలు, 5 ఆగస్టు (హి.స.)

తాటి బెల్లం.. ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. అందులో భాగంగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల పట్ల అధిక శ్రద్ధ పెడుతున్నారు. అలాంటి ఆహారాల్లో ఒకటి తాటి బెల్లం. ఈ బెల్లం వినియోగం బాగా పెరిగింది. పోషకవిలువలు పుష్కలంగా ఉండే తాటిబెల్లాన్ని చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ఆడవారిలో వచ్చే నెలసరి సమస్యలుసహా పలురకాల అనారోగ్యాలను దూరం చేసి, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు బోలెడన్నీ అందిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తాటిబెల్లంలోని ఖనిజాలు , లవణాలు చక్కెరతో పోలిస్తే 60 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. టీ, కాఫీ, పండ్లరసాలకు ఈ బెల్లాన్ని వినియోగించొచ్చు అంటున్నారు. జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

తాటి బెల్లంలోని ఐరన్‌, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచుతాయి. దీంతో రక్తహీనత ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఎక్కువ మోతాదులో ఉండే కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి.

ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి, అధిక బరువు సమస్యలకు చెక్‌ పెడుతుంది. మైగ్రేన్‌ వచ్చినప్పుడు నోట్లో చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది. వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లబరుస్తుంది.

పొడిదగ్గు, జలుబు వంటివాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. గోరువెచ్చని కప్పు పాలల్లో చెంచా తాటిబెల్లం పొడి, పావుచెంచా మిరియాలపొడి కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. జలుబు వల్ల చేరిన శ్లేష్మాన్ని తొలగించి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆస్తమాకీ దూరంగా ఉండొచ్చు.

తాటి బెల్లంలో ఐరన్, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. తాటి బెల్లం తరచూ తీసుకోవటం వల్ల కాల్షియం, పొటాషియం పెరిగి ఎముకలు బలంగా తయారవుతాయి. నెలసరి, అధిక బరువు సమస్యలకు కూడా తాటి బెల్లం సహాయపడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి

 rajesh pande