మేడ్చల్, 5 ఆగస్టు (హి.స.)
Hyderabad: సిలిండర్ పేలి.. భవనం కూలి.. వీధిలో వెళ్తున్న ఒకరి మృత
: వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కుప్పకూలింది. ఈ భవన శకలాలు తగిలి వీధిలో వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. వృద్ధురాలితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మురళి ఇంట్లో మొబైల్‌షాపుతో పాటు రెండు పూల దుకాణాలు ఉన్నాయి. రాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భవన శకలాలు ఎగిరి పడి.. ఎదురుగా ఉన్న మరో దుకాణం షట్టర్ ధ్వంసమయ్యింది. భవన శకలాలు తగలడంతో వీధిలో వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఇతని వివరాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వృద్ధురాలు తిరుపతమ్మతో పాటు, రఫిక్, దినేష్‌లకు గాయాలయ్యాయి వీరిని 108లో కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ